పల్నాడు జిల్లా సత్తెనపల్లి క్రిస్టియన్ పేటలో ఈ నెల 8వ తేదీన జరిగిన రమాదేవి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. తొలుత ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించినప్పటికీ, పోలీసుల లోతైన దర్యాప్తులో కన్నకూతురే కాలయముడుగా మారినట్లు తేలింది. కుటుంబ కలహాలు, తల్లి మానసిక వేధింపుల కారణంగా విసిగిపోయిన కూతురు లక్ష్మి..పక్కా పథకం ప్రకారం తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసిందని పోలీసులు చెప్పారు.. అనంతరం ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి అత్యంత కిరాతకంగా హతమార్చిందన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితురాలు లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకుని, హత్యకు గల పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు పోలీసులు.