తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేసిన నూతన వధువరులు తమ తప్పును తెలుసుకున్నారు. శ్రీవారి ఆలయం ముందు ఫొటోషూట్ చేసినందుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు తమిళనాడు, తిరువన్నమలైకి చెందిన తిరుమల్, గాయత్రి దంపతులు వీడియో విడుదల చేశారు. శ్రీవారి సేవ ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుంటామని వెల్లడించారు. ఇది ఆలయ నియమాలకు విరుద్ధమని తెలిసిన వెంటనే, ఆ ఫోటోలను పూర్తిగా తొలగించినట్లు వారు స్పష్టం చేశారు.