ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకల పేరుతో భారీస్థాయిలో కోడిపందాల నిర్వహణకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. తిరువూరుతో పాటు విసన్నపేట, గంపలగూడెం, ఏ.కొండూరు మండలాల్లోని ప్రధాన గ్రామాల్లో స్టేడియాలను తలపించేలా భారీ బరులను తీర్చిదిద్దారు. పందాలతో పాటు పేకాట, గుండాట వంటి జూదాలకు కూడా సకల హంగులతో ఏర్పాట్లు పూర్తి కాగా, వీక్షకుల కోసం భారీ స్క్రీన్లను సైతం ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పందెంరాయుళ్ల కోసం ఇప్పటికే లాడ్జిలు, హోటళ్లలో ముందస్తు బుకింగ్స్ పూర్తి చేసి, ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత విలాసవంతంగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.