నారాయణపేట జిల్లాలో మద్దూరు మండళంలోలో స్కూలు పిల్లల ప్రయాణం ఆందోళన కలిగిస్తోంది. సమయానికి పాఠశాలకు వెళ్లాలనే తపనతో విద్యార్థులు బొలేరో వాహనానికి వేలాడుతూ ప్రమాదకరంగా వెళ్తున్నారు. స్కూల్ టైమింగ్‌కి బస్సుల కొరత వల్లే ఇలా ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నామని విద్యార్థులు తెలుపుతున్నారు. అధికారులు స్పందించి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.