బంగ్లాదేశ్‌లో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) రణరంగంగా మారింది. 'స్నేహపూర్వక' మ్యాచ్ కాస్తా WWE రాయల్ రంబుల్ తరహాలో ఘర్షణకు దారితీసింది. సెమీఫైనల్‌కు ముందు ఒక బౌండరీ, అవుట్ నిర్ణయంపై ఇరు జట్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ గొడవలో ఆరుగురు సెలబ్రిటీలు గాయపడగా, పరిస్థితి విషమించడంతో టోర్నమెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు.