సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అగ్నిగుండాల ప్రవేశంతో అత్యంత వైభవంగా ముగిశాయి. 202 ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు, స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాలను దాటుతూ, బండారి చల్లుతూ మల్లికార్జున స్వామి నామస్మరణతో పొట్లపల్లి పురవీధులను మార్మోగించారు.