కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ మోరి-5 బావి వద్ద సంభవించిన బ్లోఅవుట్ స్థానికులను వణికిస్తోంది. డ్రిల్లింగ్ సమయంలో గ్యాస్ లీకై భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. రెండు రోజులు గడుస్తున్నా అగ్నికీలలు అదుపులోకి రాలేదు. అగ్నిమాపక సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నా, పరిస్థితి చక్కబడటానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.