ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం అదుపు తప్పి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఏలూరు జిల్లాకు చెందిన సాయి మహేష్ (35), గట్టు రాంబాబు (39) శుక్రవారం ఖమ్మం వెళ్తుండగా లింగాల సమీపంలో ఈ ఘటన జరిగింది. వారు బైక్‌పై అతివేగంగా ప్రయాణిస్తూ రెయిలింగ్‌ను ఢీకొన్నారు. దీంతో కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో నమోదయ్యాయి.