తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో జనాలను హడలెత్తించిన ఎలుగుబంటిని అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని దయ్యాల ధనూర్ లో అటవీశాఖ అధికారులు ఎలుగుబంటిని బంధించారు. కొద్దిరోజులుగా మహారాష్ట్రలో ఈ ఎలుగుబంటి దాడిలో ముగ్గురు చనిపోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి ఎలుగుబంటి ప్రవేశించడంతో.. జనమంతా భయాందోళనకు గురయ్యారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి.. ఎలుగుబంటిని ఎట్టకేలకు పట్టుకున్నారు. చివరకు స్థానికులంతా ఊపిరిపీల్చుకున్నారు.