TG: మేకలు, గొర్రెల రక్తంతో అక్రమంగా దందా చేస్తున్న CNK ల్యాబ్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. కీసరలో మూగజీవాల నుండి రక్తాన్ని సేకరిస్తున్న మటన్ షాపు యజమాని సోను, నకిలీ వెటర్నరీ డాక్టర్ సంజీవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రక్తం కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు, ల్యాబ్‌లో భారీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ల్యాబ్ యజమాని నికేష్ కోసం గాలిస్తున్నారు.