భారత టీ20 ఆటగాళ్లు కొంతమంది ప్రకృతిని ఆస్వాదించడానికి విదర్భ ప్రాంతంలోని టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో సఫారీకి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను సంజు శాంసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఓపెన్ టాప్ జీపులో సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, రవి బిష్ణోయ్, రింకు సింగ్ తదితరులు వన్యప్రాణులు, పక్షులను తమ కెమెరాల్లో బంధించారు