తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్యకర్తలకు ఈ సందర్భంగా మెమెంటోలు అందజేసి అభినందించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరాజు, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.