కర్నూలులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. రెండ్రోజుల క్రితం జాతీయ రహదారిపై మూడు ఆటోలు స్టంట్స్ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీనిపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పందించి ఆటోలను గుర్తించాలని పోలీసులను ఆదేశించారు. వారు ఆటోలను గుర్తించి డ్రైవర్లను అరెస్టు చేశారు.