తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ సాక్షిగా మోహన్ బాబు విద్యాసంస్థల తీరుపై విద్యార్థి సంఘాలు పోరుబాట పట్టాయి. విద్యార్థి నేతలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, మోహన్ బాబు, మంచు విష్ణులను తక్షణమే అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. తాము డబ్బులు డిమాండ్ చేసినట్లు నిరూపించలేకపోతే ఎం.బి.యు కాలేజీ ముందే ఆత్మహత్య చేసుకుంటారా? అని మోహన్ బాబుకు విద్యార్థి నేతలు సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలతో తమను వేధించడం ఆపాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.