సొంత అత్త ఇంట్లో అల్లుడు చోరి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు గ్రామంలో చోటుచేసుకుంది. సంతులాల్ పోడు గ్రామానికి చెందిన గోలి వెంకటేశ్వర్లు తన పెద్దకూతురు ఇంటికి ఫంక్షన్ కోసం 3రోజుల కిందట ఖమ్మం వెళ్లారు. నాలుగో రోజు ఇంటికి తిరిగి వచ్చిచూడగా.. ఇంట్లో 2తులాల బంగారం మాయం కావడంతో అందోళన చెందారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన బయ్యారం పోలీసుల కేసు నమెదు చేసి విచారణ చేప్పటారు. దొంగతనానికి పాల్పడిన అల్లుడు.. భయంతో నిన్న తెల్లవారుజామున ఇంటి అవరణలో బంగారం వదిలేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతడిని అదుపులోకీ తీసుకోని విచారించగా.. దొంగతనం తనే చేశానని అంగీకరించాడు.