మైనస్ డిగ్రీల చలిలో, ఎముకలు కొరికే మంచు కురుస్తున్నా భారత సరిహద్దుల్లో సైనికుల పహారా ఆగడం లేదు. తాజాగా ఓ సైనికుడు ఆరుబయట నిద్రిస్తున్న ఫోటో నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఆయన కప్పుకున్న దుప్పటిపై మంచు పొరలు పేరుకుపోయినా, దేశ రక్షణే ధ్యేయంగా వారు చూపుతున్న ధైర్యం అమోఘం.