నంద్యాల జిల్లా మహానంది ఆలయ ప్రాంగణంలో పాము కలకలం రేపింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జనం ఎక్కువగా ఉండటంతో.. పామును చూసిన భక్తులు భయాందోళనతో ఒక్కసారిగా కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన ఆలయ అధికారులు స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని మోహన్.. పామును పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా అకస్మాత్తుగా పాము ఆయన్ని కాటేసింది. వెంటనే ఆలయ అధికారులు ప్రథమ చికిత్స చేయించి.. అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్నేక్ క్యాచర్ మోహన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.