అన్నమయ్య జిల్లా ములకలచెరువు హైవేపై గొడ్డావుల కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో కారు డ్రైవర్‌తో పాటు ఒక మహిళ ఉన్నారు. వీరు అనంతపురం జిల్లా నుండి మదనపల్లి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.