శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళాశాల ప్రాంగణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ ఏవో రామయ్య, అధ్యాపక సిబ్బందితో కలిసి భోగి మంటలను వెలిగించి వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. పచ్చని కొబ్బరి మట్టల పందిళ్లలో ఇంజనీరింగ్ విద్యార్థినులు సాంప్రదాయబద్ధంగా పొంగళ్ళు వండి, కొత్త వెలుగులతో పండుగ జరుపుకున్నారు.