అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సౌజన్యంతో వి.ఎస్.ఎం కళాశాలలో పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగులను ఎంపీ హరీష్ మాధుర్, కలెక్టర్ మహేష్ కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలవడంతోనే నేడు పల్లెల్లో సంక్రాంతి శోభ సంతరించుకుందని, ఉమ్మడి కుటుంబాల సందడి కనిపిస్తోందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటి వద్ద ఉండే మహిళలు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో విభిన్న వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.