కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సంక్రాంతి ముగింపు వేళ కోడి పందాలు, జూద క్రీడలు హోరాహోరీగా సాగుతున్నాయి. మంగినపూడి బీచ్ రోడ్డుతో పాటు గ్రామ గ్రామాన భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేయడంతో పందెపు రాయుళ్లు కోట్లాది రూపాయలు ఒడ్డుతూ జూదంలో మునిగిపోయారు. రాత్రి పగలు తేడా లేకుండా సాగుతున్న ఈ పందాల్లో నిర్వాహకులు 10 నుండి 20 శాతం వరకు కమీషన్ల రూపంలో భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పండుగ చివరి రోజు కావడంతో పందాలను తిలకించేందుకు నగర వాసులు భారీగా తరలిరావడంతో మచిలీపట్నం పరిసర ప్రాంతాలన్నీ జనసందోహంగా మారాయి.