శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర రెవెన్యూ కార్యాలయ ఆవరణలో ‘రెవెన్యూ క్లినిక్’ అధికారికంగా ప్రారంభమైంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ఆర్డీఓ ఆనంద్ కుమార్ ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టాదారు పాస్‌బుక్స్, హక్కు పత్రాలు, వారసత్వ భూ వివాదాల వంటి సమస్యలపై ప్రజల నుంచి భారీగా అర్జీలు స్వీకరించారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఒకే వేదికపై తక్షణ పరిష్కారం చూపిస్తూ బాధితులకు అక్కడికక్కడే హక్కు పత్రాలను మంజూరు చేస్తున్నారు. ఈ విధానం వల్ల ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవ్వడమే కాకుండా రెవెన్యూ సేవల్లో పారదర్శకత పెరుగుతుందని అధికారులు తెలిపారు.