ఉత్తరప్రదేశ్లోని గొండా మెడికల్ కాలేజీలో ఎలుకల స్వైరవిహారం కలకలం రేపుతోంది. ఆర్థోపెడిక్ వార్డులో రోగుల పడకల కింద, ఆక్సిజన్ పైప్లైన్ల వద్ద ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పారిశుధ్య లోపం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని బాధితులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు, తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.