బాపట్ల జిల్లా చీరాలలోని వృద్ధాశ్రమంలో ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ సందడి చేశారు. వృద్ధులకు స్వయంగా అల్పాహారం వడ్డించడమే కాకుండా, తమదైన శైలిలో కర్రసాము విన్యాసాలు మరియు నృత్యాలతో అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 'అఖండ-2' చిత్రానికి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి, ప్రభాస్, రవితేజ చిత్రాలను ఆదరిస్తున్న సినీ ప్రియులకు ధన్యవాదాలు తెలుపుతూ, చిన్నారులతో ఫోటోలు దిగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.