బాపట్ల జిల్లా చీరాల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య యాదవ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించిన ఆయన, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చీరాల మండలంలోని 14 పంచాయతీలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు చెత్త సేకరణ రిక్షాలు, డస్ట్ బిన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా చెత్త రిక్షాను తొక్కి పారిశుద్ధ్య కార్మికుల్లో మరియు కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.