ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. గురువారం రాత్రి ఆందోళనకారులు తూర్పు టెహ్రాన్‌లోని ఒక ప్రభుత్వ భవనానికి నిప్పు పెట్టారు. భవనం మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 12 రోజులుగా సాగుతున్న ఈ పోరాటంలో ఇప్పటివరకు 45 మంది మరణించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్ బ్లాకౌట్ ప్రకటించింది.