యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ 17వ వార్డులో ఏకగ్రీవ ఎన్నిక చిచ్చు రేపింది. తమకు తెలియకుండానే అభ్యర్థుల నామినేషన్లు ఎలా ఉపసంహరించుకుంటారని, తమ ఓటు హక్కును కాలరాశారని ఓటర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఓటు హక్కు లేని తాము బ్రతికి ఉన్నా చనిపోయినట్టేనని, తమకు డెత్ సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏకగ్రీవాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.