తమిళనాడుకు చెందిన గిరిజన చిత్రకారుడు దివంగత ఆర్.కృష్ణన్కు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించడంపై ఆయన భార్య సుశీల హర్షం వ్యక్తం చేస్తూనే, తమ దయనీయ స్థితిని వివరించారు. భర్త మరణం తర్వాత కూలి పనులతో నలుగురు పిల్లలను పోషిస్తున్నానని, ఆర్థిక ఇబ్బందుల వల్ల పెద్ద కుమార్తె చదువు ఆగిపోయిందని ఆవేదన చెందారు.