ఏలూరు జిల్లా చిత్తపూర్ పరిసరాల్లోని మామిడి, పామాయిల్ తోటల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా కోడి పందేల బరులపై దాడులు చేయడంతో.. పందెపురాయుళ్లు పరారయ్యారు. అనంతరం గ్రామ శివారుల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.