శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. కదిరి పట్టణంలోని గజ్జలరెడ్డిపల్లి లో అర్ధరాత్రి పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో పేకాట స్థావరంపై కదిరి పోలీసులు దాడులు చేసి.. తొమ్మిది మంది పేకాటరాయుళ్లును అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,85,000 వేల రూపాయలు నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయళ్లపై కదిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపుతామని తెలిపారు.