శ్రీ సత్యసాయి జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామమైన రావులచెరువులో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ నేతృత్వంలో శనివారం తెల్లవారుజాము నుండే తనిఖీలు చేపట్టారు. సుమారు 150 మంది పోలీస్ బలగాలు, ఐదుగురు ఫింగర్ ప్రింట్ నిపుణులు, రెండు డ్రోన్ కెమెరాల సహాయంతో గ్రామాన్ని అంగుళం అంగుళం జల్లెడ పట్టారు. ఎస్పీ స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్షనిస్ట్, రౌడీ షీటర్ రావులచెరువు ప్రతాపరెడ్డికి ఎస్పీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రజలను బెదిరించినా సహించేది లేదని కఠినంగా స్పష్టం చేశారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.