అంటార్కిటికాలో మంచులో ఫోటోలు తీస్తున్న ఒక ఫోటోగ్రాఫర్ వద్దకు ఓ పెంగ్విన్ నిశ్చింతగా వచ్చి ఆనుకుంది. ఆ మూగజీవి దృష్టిలో ఆయన శత్రువు కాదు.. కేవలం చలి నుంచి రక్షణనిచ్చే 'వెచ్చని రాయి' మాత్రమే! తన కాళ్ళతో ఆయనను తాకుతూ, శరీర వెచ్చదనం కోసం దగ్గరకు చేరిన ఈ అద్భుతమైన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.