తూర్పుగోదావరి జిల్లా ప్రజలను వణికించిన పెద్దపులిని.. అటవీశాఖ అధికారులు సురక్షితంగా పాపికొండలు నేషనల్ పార్కులో వదిలిపెట్టారు. ఈనెల 6న పట్టుబడిన పెద్దపులిని విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్ లో వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యంగా ఉన్న పులిని తిరిగి అడవిలో వదిలిపెట్టారు. దీంతో సుమారు 25 రోజులు పాటు ఉన్న పులి అభయారణ్యంలోకి వెళ్ళటంతో కథ సుఖాంతం అయ్యింది. అయితే.. మహారాష్ర్ట తడోబా నుంచి వచ్చిన ఈ పెద్దపులి.. ఏపీలోని జనావాసాల్లో సంచరించి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.