హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామ సర్పంచ్ ముప్పు శైలజా శ్రీనివాస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఊర్లో ఎవరి ఇంటనైనా అడ పిల్ల పుడితే నజరానాగా రూ.5 వేలు ఇస్తానని గ్రామసభ సాక్షిగా మహిళా సర్పంచ్ ప్రకటించారు. ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతగా.. పదవిలో ఉన్నంతకాలం ఈ సాయాన్ని కొనసాగిస్తానని ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే గ్రామసభ నిర్వహించి.. గ్రామానికి చెందిన చందా బాలరాజు- స్రవంతి దంపతులకు ఆడబిడ్డ జన్మించగా. వారికి సర్పంచ్ రూ.5 వేల నగదును అందజేశారు.