కర్నూలు నగరంలో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిన విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన నటుడు మోహన్ బాబు, మంచు విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. తప్పులను ప్రశ్నిస్తే కిడ్నాపులకు పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. వెంటనే మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.