ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల భోగి మంటలను వేసి ప్రజలు వేడుకలను చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలోని విఎస్ఎం కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సందడి చేశారు. వేదికపై డ్యాన్స్ చేసి స్థానికులను ఉత్సాహపరిచారు. వేదికపై ఢీ షో డ్యాన్సర్‌తో కలిసి మంత్రి వాసంశెట్టి ఫుల్ జోష్‌తో స్టెప్పులు వేశారు. ఇక వాసంశెట్టిన చూసిన ప్రేక్షకులు కేరింతలు కొడుతూ.. వాళ్లు డ్యాన్స్ చేశారు.