నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ప్రయాణికులు ప్రమాదానికి గురై రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉండగా.. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. వెంటనే వాహనం దిగి బాధితుల వద్దకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. మంత్రి స్వయంగా దగ్గరుండి క్షతగాత్రులను అంబులెన్స్‌లోకి చేరవేసి ఆసుపత్రికి పంపించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడి, బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో మంత్రి చూపిన చొరవను స్థానికులు అభినందిస్తున్నారు.