మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. జనసంద్రంగా మారింది. అయితే.. మేడారంలో వనదేవతల దర్శనం తర్వాత తిరుగు పయనం అయ్యే భక్తులకు బస్సులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి బస్టాండ్లోనే ఉన్న ఒక్క బస్సు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగారు. అక్కడున్న ఒక బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. భక్తుల రిటర్న్ జర్నీ కోసం అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు. భక్తుల ఆందోళనతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.