పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండల కేంద్రంలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. ఒకే రోజులో ముగ్గురు విద్యార్థులు, 15 మంది పాదచారులు, వాహనదారలపై విచక్షణారహితంగా దాడి చేసింది. దాంతో.. స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ముఖ్యంగా కచేరి సెంటర్, కళ్యాణ మండపం వీధి, కళాశాల పరిసర ప్రాంతాల్లో కుక్కలు వెంటాడి మరి దాడులకు తెగబడుతున్నాయి. దీంతో తమ పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. కుక్కల దాడిలో గాయపడిన వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని, నిర్మూలన చర్యలు చేపట్టాలని ఆచంట ప్రజలు వేడుకుంటున్నారు.