ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఈ వృద్ధ జంట నిరూపించింది. అనారోగ్యంతో మంచానపడిన భార్యకు ఓ వృద్ధుడు ఎంతో వాత్సల్యంతో, ఓ తండ్రిలా బుజ్జగిస్తూ ఇడ్లీలు తినిపిస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఆమె వద్దని వారిస్తున్నా, ప్రేమగా దగ్గరుండి తినిపిస్తున్న ఆ దృశ్యం కళ్లు చెమర్చేలా చేస్తోంది.