మార్కాపురం జిల్లాలోని రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. 'బై వన్ గెట్ వన్' ఆఫర్ల పేరుతో బోర్డులు పెట్టి, తీరా బిల్లింగ్ దగ్గరకు వచ్చేసరికి ఒక ప్యాకెట్ మాత్రమే ఇస్తూ, బిల్లులో మాత్రం రెండు వస్తువుల ధరను జోడిస్తూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీనిపై వినియోగదారులు నిలదీస్తే సమాధానం చెప్పకుండా సిబ్బంది దాటవేత ధోరణి ప్రదర్శిస్తుండటం గమనార్హం. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇలాంటి మోసపూరిత ఆఫర్లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న మార్ట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.