దేశీయ వీధి కుక్కల సంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని 'క్విక్ రియాక్షన్ బ్యాగ్' డైరెక్టర్ కళ్యాణి ప్రసాద్ పిలుపునిచ్చారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల భారతీయ శునక జాతులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ జాతులతో పోల్చితే మన వీధి కుక్కలు అత్యంత ఆరోగ్యకరమైనవని, తక్కువ ఖర్చుతో కూడిన ఆహారం, సకాలంలో వ్యాక్సినేషన్ అందిస్తే వాటి మనుగడ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమాజ హితం కోరే తమ సంస్థ ద్వారా ప్రతి నెలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలు కూడా వీధి కుక్కల పట్ల సానుకూలంగా స్పందించాలని ప్రతినిధి సింధుజతో కలిసి ఆమె విజ్ఞప్తి చేశారు.