ఇరాన్‌పై సైనిక చర్యకు దిగబోమంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తీరం వైపు అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకలు, సైనిక దళాలు కదులుతున్నాయని, అక్కడి పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించారు. అలాగే ఇరాన్లో 837 మంది ఉరిశిక్షలను తాను అడ్డుకున్నానని ఆయన పేర్కొన్నారు.