కామారెడ్డి జిల్లాలో ఒక అరుదైన వివాహ వేడుక అందరినీ ఆకర్షించింది. అచ్చం ఒకే పోలికలతో ఉండే ఇద్దరు కవల సోదరులు, అలాగే ఒకే రూపురేఖలతో ఉండే ఇద్దరు కవల సోదరీమణులను మనువాడారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ కవలలు కాగా.. తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తన, కీర్తిలు కూడా కవలలు. వీరి వివాహం కామారెడ్డిలో ఒకే ముహూర్తానికి వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుక 'కవలల దినోత్సవం రోజే జరగడం విశేషంగా మారింది. ఒకేలా ఉన్న వధూవరులను చూసి ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో అని కొందరు ఆశ్చర్యపోగా, మరికొందరు ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చూడటం తమ అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ రెండు జంటలు ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.