శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు ఆరు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ పనులను ఆయన ప్రారంభించారు. ముందుగా రెక్కమాను నుండి వెలిచెలమల గ్రామం వరకు మూడు కోట్ల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం గాండ్లపెంట మండల కేంద్రంలో మరో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడంతో పాటు, నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి జాతికి అంకితం చేశారు.