తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ జనసేన తన దూకుడు పెంచింది. ఈ నెల 7, 8 తేదీల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారని తెలంగాణ జనసేన ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ వెల్లడించారు. 340 మంది అభ్యర్థులకు బీ-ఫామ్స్ ఇచ్చామని, బీజేపీతో స్నేహపూర్వక పోటీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో మాదిరిగానే తెలంగాణలోనూ కూటమి స్ఫూర్తితో ముందుకు వెళ్తామని, జగన్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో పదేళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికే టికెట్లు ఇచ్చామని శంకర్ గౌడ్ పేర్కొన్నారు.