ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటున్నామన్న పాకిస్థాన్ వాదనలు మరోసారి అబద్ధమని తేలిపోయాయి. ఐక్యరాజ్యసమితి నిషేధించిన జైషే మహ్మద్(JeM) ఉగ్రవాద సంస్థ పాకిస్థాన్లోని పలు రాష్ట్రాల్లో బహిరంగంగా ర్యాలీలు నిర్వహిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సింధ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతాల్లో పోలీస్ రక్షణతోనే ఈ ర్యాలీలు జరగడం గమనార్హం. చిన్న పిల్లలను కూడా భాగం చేస్తూ, భారత్కు వ్యతిరేక నినాదాలు చేస్తున్నా అక్కడి భద్రతా దళాలు చూస్తూ ఊరుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.