ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహరాబాద్ ఎయిర్‌పోర్టుపై ఇజ్రాయెల్ వైమానిక దళం భీకర దాడులు చేసింది. IRGC ఆయుధ రవాణా కేంద్రంగా వాడుకుంటున్న ఈ విమానాశ్రయంపై దాడులు జరపడంతో 16 యుద్ధ విమానాలు ముక్కలయ్యాయి. రన్‌వేపై విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు భీతిని కలిగిస్తున్నాయి. ఈ ఆకస్మిక దాడితో ఇరాన్ రక్షణ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.