ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ప్రముఖులను ఆహ్వానించే ప్రక్రియను మంత్రి సీతక్క వేగవంతం చేశారు. నేడు శాసనసభ వేదికగా సిపిఐ, బిజెపి మరియు ఎంఐఎం శాసనసభా పక్ష నేతలను కలిసి ఆమె జాతర ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం తల్లుల ప్రసాదమైన పసుపు, కుంకుమ, బంగారం వారికి అందజేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి మహా జాతరకు రావాల్సిందిగా మంత్రి కోరారు. మంత్రులు, శాసనసభ్యులు మరియు ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా కలుస్తూ మేడారం జాతర విశిష్టతను వివరిస్తున్న సీతక్క.. భక్తులందరికీ తల్లుల ఆశీస్సులు అందాలని ఆకాంక్షించారు.