ఏలూరు నగరంలో టీ పొడి విక్రయ కేంద్రాలపై విజిలెన్స్, ఆహార భద్రతా అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు షాపుల్లో విక్రయిస్తున్న టీ పొడుల్లో నాణ్యత లోపించడమే కాకుండా, రంగు కోసం ప్రమాదకరమైన సింథటిక్ కలర్స్ కలిపినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. తనిఖీల్లో భాగంగా సేకరించిన శాంపిల్స్ ను వెంటనే ల్యాబ్ పరీక్షల నిమిత్తం పంపించారు. కొన్ని ప్యాకెట్లపై అడ్రస్ వివరాలు కూడా తప్పుగా ఉండటంతో, ఇవి ఎక్కడ తయారవుతున్నాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. సింథటిక్ రంగులు కలిపిన టీ పొడిని దీర్ఘకాలం వాడటం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరత్నం హెచ్చరించారు.